inputs
stringlengths 28
112
| targets
stringlengths 30
2.36k
| template_id
int64 1
14
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పొదుపు అవసరం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'పొదుపు అవసరం'
‘‘సార్, మన సినిమాలో బిచ్చగత్తె పాత్రకి సాదాసీదా మొహం గల అమ్మాయి కావాలి’’ చెప్పాడు డైరెక్టరు.
‘‘ఇప్పటికే బడ్జెట్ ఎక్కువై ఏడుస్తుంటే మరొకర్ని ఎక్కడ్నుంచి తెచ్చేదయ్యా? మన హీరోయిన్నే మేకప్ లేకుండా చూపించు చాలు’’ చిరాగ్గా సలహా ఇచ్చాడు నిర్మాత భజగోవిందం. | 4 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నేటి ప్రేమ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నేటి ప్రేమ'
‘‘ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా ... ఈలోగా ప్రేమికుల రోజు జరుపుకోవాలా రాజూ?’’ సందేహంగా అడిగింది రాణి.
‘‘పెళ్లిరోజు వరకు కలిసుంటామంటావా’’ ఠపీమని బదులిచ్చాడు రాజు. | 8 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డూప్ లేక నేను లేను ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'డూప్ లేక నేను లేను'
‘‘శోభనం రోజే మీ ఆవిడ మిమ్మల్ని చెప్పుతో కొట్టడానికి కారణం?’’ అడిగాడు విలేకరి.
‘‘నాది మొదట్నించి రిస్క్ తీసుకునే మనస్తత్వం కాదు. ఎందుకైనా మంచిదని ముందుగా శోభనం గదిలోకి నా డూప్ని పంపాను’’ తాపీగా బదులిచ్చాడు సినిమా హీరో. | 5 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ‘యాడే’ అసలు కారణం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: '‘యాడే’ అసలు కారణం'
‘‘మన టూ వీలర్స్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడం వెనకున్న కారణం కనిపెట్టారా?’’ కోపంగా అడిగాడు యజమాని.
‘‘ప్రతి టూ వీలర్తో పాటు టూల్ సెట్కి బదులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫ్రీ అనే యాడ్ ఇవ్వడం వల్ల’’ నసుగుతూ చెప్పాడు సేల్స్మేన్. | 8 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ డబ్బారాయుళ్లు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'డబ్బారాయుళ్లు'
‘‘మీకోసం గంగాజలంతో కాఫీ చేయించాను. తాగండి’’ చెప్పాడు కోతలరాయుడు.
‘‘అబ్బెబ్బే వద్దు ... నీనిప్పుడే అమృతం తాగి ఇలా వచ్చా’’ బదులిచ్చాడు డాబులరాయుడు. | 10 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కంత్రీ మొగుడు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'కంత్రీ మొగుడు'
‘‘ఫిల్టర్ కాఫీ తయారుచేసుకు వస్తానని వంటింట్లోకి వెళ్లిందా ... గుండె నెప్పి అంటూ కేకేసి కుప్పకూలిపోయింది’’ చెప్పాడు బాబూరావు.
‘‘అయ్యోపాపం .. మీ కష్టం పగాళ్లకైనా రావద్దు. వెంటనే ఏం చేశారు?’’ జాలిగా అడిగాడు సుబ్బారావు.
‘‘ఏం చేస్తాను ... చచ్చినట్టు ఇన్స్టెంట్ కాఫీ కలుపుకు తాగి, ఆనక అంబులెన్స్కి కాల్ చేశా’’ చిరాగ్గా చెప్పాడు బాబూరావు. | 9 | ['tel'] |
ఆటోజా ... తప్పింది అనే టైటిల్ తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'ఆటోజా ... తప్పింది'
‘‘నీ కూతురి పేరు అంబుజా ... వెరైటీగా ఉందే’’ ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి.
‘‘అంబులెన్స్లో పుట్టిందని అలా పెట్టాం’’ గర్వంగా చెప్పింది మీనాక్షి.
‘‘నయం ... ఆటోలో పుట్టలేదు’’ నవ్వింది కామాక్షి. | 2 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మిత్రలాభం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'మిత్రలాభం'
‘‘ఒరే శీనూ .. నీటముంచినా, పాలముంచినా నీదే భారం’’ దీనంగా అన్నాడు భాను.
‘‘అంత ఖర్చుపెట్టి పాలు తేలేను కానీ, నీట్లో ముంచుతాలే’’ తాపీగా చెప్పాడు శీను. | 4 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మాతృప్రేమ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'మాతృప్రేమ'
‘‘మా అమ్మాయిని కొట్టకండి టీచర్ .. జ్వరమొచ్చిద్ది’’ చెప్పింది సుబ్బలక్ష్మి.
‘‘అల్లరి బాగా చేస్తే తప్పదు మరి’’ నవ్వుతూ అంది టీచరమ్మ.
‘‘అప్పుడు పక్కమ్మాయిని కొట్టండి. మా అమ్మాయి వెంటనే అల్లరి మానేస్తుంది’’ సలహా ఇచ్చింది సుబ్బలక్ష్మి. | 3 | ['tel'] |
చిట్టి తవిక అనే టైటిల్ తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'చిట్టి తవిక'
శ్రీరామ రక్ష - రేపే పరీక్ష
పూనాను దీక్ష - పాసయితే లక్ష
ఫేలయితే రిక్షా - అదే నాకు శిక్ష! | 2 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అంతకంటేనా? ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అంతకంటేనా?'
‘‘నేను ఏ ధర్మం చేస్తే ప్రజలు నన్ను గౌరవిస్తారంటావు సెక్రటరీ?’’ అడిగాడు మంత్రి పున్నారావు.
‘‘కాలధర్మమండి’’ ఠపీమని సెలవిచ్చాడు సెక్రటరీ. | 4 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అసలంటూ ఉండాలిగా .. ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అసలంటూ ఉండాలిగా ..'
‘‘మనూరి గవర్నమెంటు ఆస్పత్రిలో మెదడువాపు వ్యాధి రాకుండా బిళ్లలిస్తున్నారట .. వెళ్లొస్తాను’’ గడపదాటుతూ చెప్పాడు చెంగల్రావు.
‘‘అవి మెదడున్నోళ్ళకేమోనండి ...’’ వెనకనుండి వినిపించింది భార్య గొంతు. | 10 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ శాంపుల్ చూడండి! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'శాంపుల్ చూడండి!'
‘‘ఈ ఎలకలమందు బాగా పని చేస్తుందా?’’ అనుమానంగా అడిగాడు వీరగంధం.
‘‘అంత అనుమానమైతే కొంచెం తిని చూడండి’’ అలవాటుగా చెప్పాడు దుకాణం యజమాని. | 11 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అద్గదీ సంగతి! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అద్గదీ సంగతి!'
‘‘ఏంటయ్యా సర్వరూ ... అన్నం ఇంత నల్లగా తగలడ్డదేం?’’ కోపంగా అరిచాడు సుబ్బారావు.
‘‘మా ప్రొప్రయిటరు బియ్యాన్ని బ్లాకులో కొన్నారటండి’’ తాపీగా బదులిచ్చాడు సర్వర్. | 14 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నన్నలా పంచుకున్నారు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నన్నలా పంచుకున్నారు'
‘‘మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి, సాయంత్రం నానమ్మ ఇంటికి భోజనానికి వెళ్తున్నావెందుకురా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బంటి.
‘‘మా అమ్మానాన్న పోట్లాడుకుని వాళ్ల వాళ్ల పుట్టిళ్ళకు వెళ్లారు. అందుకే నాకీ తిప్పలు’’ నిట్టూరుస్తూ చెప్పాడు చంటి. | 11 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గడసరి అత్త ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'గడసరి అత్త'
‘‘ఏంటత్తయ్యా ... ఈ రోజు బియ్యంలో రాళ్లు ఏరకుండానే అన్నం వండుతున్నావు?’’ ఆశ్చర్యంగా అడిగింది కోడలమ్మ.
‘‘ఈరోజు నేను ఉపవాసం కదమ్మా ... ’’ నవ్వుతూ చెప్పింది అత్తమ్మ. | 5 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వ్యాపార ప్రకటన ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'వ్యాపార ప్రకటన'
డెంటిస్టు ఏకదంతం తన హాస్పటల్ గురించి ఇచ్చిన ప్రకటన ఇది.
‘‘మా హాస్పటల్లో మూడు పళ్లకు పైగా పీకుంచుకున్నవారికి జ్ఞాన దంతం ఫ్రీగా పీకబడును’’ | 13 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కూల్ ఐడియా ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'కూల్ ఐడియా'
‘‘నీ భర్త స్లో పాయిజన్తో నిన్ను చంపడానికి ఎత్తువేశాడంటున్నావు .. రుజువేమిటి?’’ అడిగాడు జడ్జి.
‘‘రోజూ ఒక కూల్ డ్రింక్ తాగమని ఒత్తిడి తెస్తున్నాడు యువరానర్’’ చెప్పింది పార్వతి. | 9 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నెంబరు చెప్పండి చాలు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నెంబరు చెప్పండి చాలు'
ఒక మంత్రి హఠాత్తుగా మరణించడంతో, ఆయన భార్య కఠోర తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమై ‘‘సత్యవంతుడికై పోరాడిన సావిత్రికంటే నీవే గొప్పదానివి. ఇవిగో నీ పతి ప్రాణంబుల్’’ అని వరమిచ్చాడు.
‘‘బోడి ప్రాణాలెవడిక్కావాలి? స్విస్ బ్యాంకు అకౌంటు నంబర్ చెప్పకుండా చచ్చాడు. ఆ నెంబరు చెప్పండి చాలు’’ వరమడిగింది మంత్రిసతి | 12 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డబ్బు పోతే తట్టుకోలేను ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'డబ్బు పోతే తట్టుకోలేను'
‘‘ఆపరేషన్ చేసేముందు బాధ తెలియకుండా ఇంజక్షన్ ఇస్తాను ... కానీ బిల్లు కట్టేప్పుడు కొంత బాధ తప్పదోయ్’’ నవ్వుతూ అన్నాడు డాక్టర్ పరమహంస.
‘‘అయితే, ఆ ఇచ్చే ఇంజక్షనేదో బిల్లు చెల్లించేప్పుడే ఇవ్వండి డాక్టర్’’ బతిమాలాడు భాస్కర్రావు. | 6 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ తర్వాత చూపుల్లేవ్! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఆ తర్వాత చూపుల్లేవ్!'
‘‘నాకో మిత్రుడున్నాడు. మా ఇద్దరి మధ్య అరమరికలు లేవు తెలుసా. ఎలాంటి రహస్యాలూ ఉండకూడదని ఒకరి తప్పులు ఒకరం మనసు విప్పి మాట్లాడుకున్నాం’’ చెప్పాడు సుబ్బారావు.
‘‘గ్రేట్ .. తర్వాత ఏమయ్యింది?’’ ఆసక్తిగా అడిగాడు అప్పారావు.
‘‘ఆ తర్వాత మేం కలుసుకోలేదు ’’ ఠపీమని బదులిచ్చాడు సుబ్బారావు. | 4 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ముందు జాగ్రత్త ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ముందు జాగ్రత్త'
‘‘రండి ... నా కారులో లిఫ్ట్ ఇస్తాను’’
‘‘ఉండండి ...
దేవుడికి ప్రార్థన చేస్తాను’’
‘‘అంటే నా డ్రైవింగ్ పై
నమ్మకం లేదా?’’
‘‘అబ్బే ...
నా ప్రార్థనపై నమ్మకముంది’’ | 9 | ['tel'] |
ప్యాసవడం గారంటీ! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'ప్యాసవడం గారంటీ!'
‘‘ఈసారైనా ప్యాసవుతానా స్వామీ?’’ చెయ్యి చాపి అడిగాడు సుబ్బులు.
‘‘తప్పకుండా ... కానీ, ఒక పనిచెయ్యాలి’’ చెప్పాడు జ్యోతిష్యుడు.
‘‘ప్యాసవడానికి ఏం చేయమన్నా చేస్తాను ...’’ ఉత్సాహంగా ముందుకు వంగాడు సుబ్బులు.
‘‘పరీక్షల ముందు కనీసం రెండు రోజులైనా చదవాలి’’ తాపీగా చెప్పాడు జ్యోతిష్యుడు. | 1 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పాటే జీవితం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'పాటే జీవితం'
‘‘మీ అమ్మానాన్నలు ఏం చేస్తుంటార్రా?’’ అడిగింది పంతులమ్మ.
‘‘పాటలు పాడుతుంటారండి’’ చెప్పాడు బుజ్జి.
‘‘గాయకులని చెప్పాలి ... సరే, ఏం పాటలు పాడుతుంటారు?’’ సవరించి అడిగింది పంతులమ్మ.
‘‘అమ్మ చీటీ పాట, నాన్న వేలం పాటండి’’ ఠపీమని చెప్పాడు బుజ్జి. | 12 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదే ... ఆలోచిస్తున్నాను ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అదే ... ఆలోచిస్తున్నాను'
‘‘డియర్, మనం పెళ్లి చేసుకోడానికి ఇదే మంచి సమయం’’ చెప్పింది సుజాత.
మౌనంగా విన్నాడు సృజన్.
‘‘మాట్లాడరేం?’’ రెట్టించింది సుజాత.
‘‘నీవన్నది నిజమే కాని, ఇంత సడన్గా మనల్ని పెళ్లాడ్డానికి ఎవరు రెడీగా ఉంటారు సుజీ?’’ నుదురు రుద్దుకుంటూ చెప్పాడు సృజన్. | 12 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎంకి పెళ్లి ... సుబ్బి చావుకి ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఎంకి పెళ్లి ... సుబ్బి చావుకి'
‘‘డాక్టర్, ఇప్పుడు నాకు ఆపరేషన్ అవసరమంటారా?’’ దీనంగా అడిగాడు ఆనందరావు.
‘‘అవసరం లేకుండా ఎందుకు చేస్తానయ్యా ... మా అల్లుడికి కారు కొనిస్తానని మాటిచ్చాను మరి’’ తాపీగా చెప్పాడు డాక్టర్. | 7 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పన్ను దక్కించుకున్నాను ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'పన్ను దక్కించుకున్నాను'
‘‘దొంగ నీ కళ్ల ముందే లక్షల సొత్తు దోచుకుంటుంటే అరవకుండా నోరు మూసుకున్నావెందుకు?’’ గద్దించాడు ఎస్.ఐ.
‘‘అరిస్తే నా బంగారపు పన్ను దొంగకి కనిపిస్తుందని’’ చెప్పాడు చెంచయ్య. | 5 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నరాలు లెక్కెడతాడేమో! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నరాలు లెక్కెడతాడేమో!'
‘‘మా ఆయన ఆవులిస్తే పేగులు లెక్కపెడతాడే’’ చెప్పింది నీరజ.
‘‘అవునా ... మరి గేదెలిస్తే?’’ ఎద్దేవా చేసింది గిరిజ. | 13 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నేను చెప్పలేనండి! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నేను చెప్పలేనండి!'
‘‘డాక్టర్ మా రాజీకి విపరీతంగా జుట్టు ఊడిపోతోంది’’ చెప్పాడు కృష్ణమూర్తి.
‘‘ఎక్కువగా ఆలోచిస్తే అంతేనయ్యా... మనసు ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పు మీ రాజీకి’’ చెప్పాడు డాక్టర్.
‘‘రాజి మా పెంపుడు కుక్కండి’’ కృష్ణమూర్తి. | 11 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నో ఆనవాలు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నో ఆనవాలు'
‘‘సార్, మీరు అర్జెంటుగా రావాలి. మన నగల షాపులో దొంగతనం జరిగింది’’ ఫోన్లో చెప్పాడు సెక్యూరిటీ.
‘‘నువ్వేం చేస్తున్నావు .. నిద్రపోతున్నావా? సీసీ కెమెరాలున్నాయి కదా ... గుర్తుపట్టండి’’ కోపంగా అరిచాడు యజమాని.
‘‘వాడు సీసీ కెమెరాలు కూడా పట్టుకుపోయాడు సార్’’ ఆవలిస్తూ చెప్పాడు సెక్యూరిటీ. | 7 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుభవసారం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అనుభవసారం'
‘‘ఒక మగవాడు ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకుంటే ఇబ్బందుల్లో పడతాడట నిజమేనా మాస్టారూ?’’ అడిగాడు శిష్యుడు.
‘‘ఇబ్బందుల్లో పడ్డానికి ఇద్దరెందుకు నాయనా?’’ తల తడుముకుంటూ బదులిచ్చాడు గురువు. | 8 | ['tel'] |
నగల మాటేంటి మరి? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'నగల మాటేంటి మరి?'
‘‘నువ్వు నిర్దోషివని రుజువైంది. నిన్ను విడుదల చేస్తున్నాం. నువ్విక హాయిగా ఇంటికి వెళ్లవచ్చు’’ తీర్పు చెప్పాడు జడ్జి.
‘‘అలాగే బాబయ్యా ... మరయితే నేను దొంగిలించిన నగల్ని నా దగ్గరే ఉంచుకోవచ్చా?’’ అమాయకంగా ప్రశ్నించాడు ముద్దాయి ఏడుకొండలు. | 1 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ విశ్వాస గార్దభర ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'విశ్వాస గార్దభర'
‘‘ఎవరైనా కుక్కని వెంట పెట్టుకుని తిరుగుతారు కానీ, నువ్వేంటి గాడిదని వెంటేసుకు తిరుగుతున్నావు?’’ నవ్వుతూ అడిగింది సునంద.
‘‘నాకు వచ్చిన ప్రేమలేఖలన్నీ ఇదే తిన్నది. ఆ విశ్వాసంతో నా తిరుగుతోంది’’ తాపీగా చెప్పింది అపర్ణ. | 12 | ['tel'] |
ఆవలిస్తే ... లెక్కట్టెగలను అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'ఆవలిస్తే ... లెక్కట్టెగలను'
‘‘మీరు కండక్టర్గారి అబ్బాయా?’’ అడిగాడు బిచ్చగాడు.
‘‘అవును. నీకెలా తెలిసింది?’’ ఆశ్చర్యపోయాడు శ్రీగంధం.
‘‘మీ జేబునిండుగా చిల్లర గలగలమంటేనూ ...’’ నసిగాడు బిచ్చగాడు. | 1 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అమ్మయ్య ... సాధించాను ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అమ్మయ్య ... సాధించాను'
‘‘ఎట్ట్టకేలకు నా పేషంట్ చేత గోళ్లు కొరికే అలవాటు మానిపించానోయ్’’ గొప్పగా చెప్పాడు డాక్టర్ వివేకం.
‘‘నిజమా? చాల్రోజుల్నించి ఆ అలవాటు మాన్పించే ప్రయత్నం చేస్తున్నావు కదా .. ఇప్పుడెలా సాధ్యపడిందోయ్?’’ అనుమానంగా అడిగాడు మిత్రుడు శ్రీముఖం.
‘‘ఒక డెంటిస్టు సాయంతో ఆ పేషంటు పళ్లన్నీ ఊడ బీకించానోయ్’’ కాలరెగరేశాడు వివేకం. | 9 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నాకంటే గొప్పోడేం కాదు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నాకంటే గొప్పోడేం కాదు'
‘‘ఏమండోయ్ ...ఇది విన్నారా? ఆ సన్యాసెవడో ఆకలికి తట్టుకోలేక పచ్చిగడ్డి తిన్నాడట’’ ఆశ్చర్యంతో చెప్పింది ఆండాళ్లు.
‘‘అందులో వింతేముంది? నేను రోజూ తినట్లా’’ ఠపీమని బదులిచ్చాడు సచ్చిదానందం. | 12 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డాక్టరు సలహా ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'డాక్టరు సలహా'
‘‘అదేంటమ్మా ... పెన్ను పక్కన పెట్టి రీఫిల్తో రాస్తున్నావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు బాస్ జోగినాథం.
‘‘నేను ఆరో నెల ప్రెగ్నెంట్ సార్ - డాక్టరుగారు బరువులు ఎత్తొద్దన్నారు’’ సిగ్గు పడుతూ చెప్పింది స్టెనో సుకుమారి. | 3 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కొత్తమాలోకం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'కొత్తమాలోకం'
కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్తో ‘‘సంగం థియేటర్ దగ్గర బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీవు వెంటనే వెళ్లి వాళ్లని ఉన్నపళంగా అరెస్టు చేసి స్టేషన్కి తీసుకురా’’ పురమాయించాడు ఎస్.ఐ.
ఒక గంట తర్వాత -
‘‘వెళ్లొచ్చాను సార్, అక్కడ యెల్లో, రెడ్ రంగుల టికెట్లు తప్పించి బ్లాక్ టికెట్లు అమ్మటం లేదు’’ సెల్యూట్ కొట్టి అటెన్షలో నిలబడి చెప్పాడు కొత్త కానిస్టేబుల్. | 3 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అంతా ప్రేక్షకుల దయ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అంతా ప్రేక్షకుల దయ'
‘‘మీరు తీస్తున్న సినిమా ట్రాజెడీయా? కామెడీయా?’’ అడిగాడు విలేకరి.
‘‘ముందే ఎట్టా తెలుస్తుందయ్యా? విడుదలయ్యాక హిట్టయితే కామెడీ, ఫట్టయితే ట్రాజెడీ’’ తడుముకోకుండా చెప్పాడు నిర్మాత. | 10 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ శకునం చూడొద్దా? ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'శకునం చూడొద్దా?'
‘‘వేటకు బయల్దేరి వెంటనే వచ్చేశావేం’’ అనుమానంగా అడిగింది పెళ్లాం పిల్లి.
‘‘గుమ్మం దాటగానే నల్లటి మనిషి ఎదురొచ్చాడు ... కాస్సేపయ్యాక వెళ్తాలే’’ చెప్పింది మొగుడు పిల్లి. | 10 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక జన్మ జన్మల బంధం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'జన్మ జన్మల బంధం'
‘‘ఆ వెంకట్గాడు రోజూ నా వెంట పడుతున్నాడు ... అర్థం కావటం లేదే’’ వాపోయింది సరోజ.
‘‘ఇందులో అర్థం కాకపోవడానికేముందే ... పూర్వజన్మలో వాడు కుక్కగా, నీవు దాని యజమానిగా పుట్టి ఉంటారు’’ తేలిగ్గా కొట్టేసింది హిమజ. | 3 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వార్నింగ్ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'వార్నింగ్'
‘‘నేను సెల్ ఫోన్ అయితే .. నీవు సిమ్ కార్డువి’’ గోముగా అంది రాధ.
‘‘యురేకా ...’’ పిడికిళ్లు బిగించి అరుస్తూ ముద్దివ్వబోయాడు మదన్.
‘‘ఓవర్ యాక్షన్ చేస్తే సిమ్ కార్డు మార్చేస్తా జాగ్రత్త’’ వార్నింగ్ ఇచ్చింది రాధ. | 10 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కనిపించని బాటిల్ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'కనిపించని బాటిల్'
‘‘టైరు ఎలా పంక్చరయ్యింది?’’
‘‘కారుని ఒక మందు బాటిల్పై నుండి నడిపాను’’
‘‘మరి మందు బాటిల్ ఏది?’’
‘‘అది ఆ తాగుబోతు జేబులో ఉండి పోయింది’’ | 5 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రివర్స్ గేర్ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'రివర్స్ గేర్'
‘‘అమ్మా ... బిచ్చం తల్లీ’’ అరిచాడు రోజూ వచ్చే బిచ్చగాడు.
‘‘హమ్మయ్య వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా .. అనుకోకుండా మా అత్తింటి బంధువులొచ్చారు. ఇప్పుడు నాకు వండే ఓపిక లేదు. నీ జోలెలో ఉన్న అన్నం, కూరలు అరువివ్వు. రేపు వడ్డీతో సహా ఇస్తాలే’’ ఖాళీ గిన్నెలు ముందుంచి బిచ్చగాడిని అర్థించింది అలివేలు. | 8 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గోడ తగవు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'గోడ తగవు'
స్వర్గానికి, నరకానికి మధ్య ఉన్న గోడ కూలిపోడానికి సిద్ధంగా ఉందని, ఇరు పక్షాల వారు సమావేశమయ్యారు.
‘‘నరకవాసుల వల్లే గోడ బీటిచ్చింది ... మీరే పునర్నిర్మించాలి’’ అన్నారు స్వర్గవాసులు.
‘‘మాకు సంబంధం లేదు. కావాలంటే కోర్టులో కేసు వేద్దాం’’ అన్నారు నరకవాసులు.
‘‘మాకు న్యాయం జరగదు. లాయర్లంతా నరకంలోనే ఉన్నారు’’ చెప్పారు స్వర్గ వాసులు. | 11 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మనిషిన్నాక కృతజ్ఞత ఉండాలే ... ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'మనిషిన్నాక కృతజ్ఞత ఉండాలే ...'
రమ, సుమ పార్కులో ఉండగా ఒక బిచ్చగాడు ఎదురై ‘‘ధర్మం చెయ్యండమ్మా’’ అని అడిగాడు.
రమ వెంటనే పర్స్లోంచి ఐదు వందల రూపాయల నోటు తీసి వేసింది.
‘‘పిచ్చెక్కిందా నీకు, అది ఐదు రూపాయలనుకున్నావా?’’ ఆశ్చర్యపోయింది సుమ.
‘‘తెలిసే వేశాను .... గతంలో అలాంటి ఐదు వందల నోట్లు నాకోసం ఎన్నో ఖర్చుపెట్టాడతను’’ తాపీగా చెప్పింది రమ. | 9 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పోలీసుల్లో మాలోకం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'పోలీసుల్లో మాలోకం'
జైలు ఆవరణలో కంగారుగా తిరుగుతున్నాడు కానిస్టేబుల్ సుబ్బారావు.
‘‘ఏంటయ్యా ... మరీ అంత కంగారు పడుతున్నావు?’’ అప్పుడే డ్యూటీకి వచ్చిన షిఫ్ట్ కానిస్టేబుల్ జోగారావు అడిగాడు.
‘‘రాత్రి ఖైదీలతో పాండవ వనవాసం నాటకం వేయించాను. పాండవుల వేషం వేసిన ఖైదీలు వనవాసానికి వెళ్లొస్తామని చెప్పి వెళ్ల్లారు. ఇంకా రాలేదని ...’’ తల గోక్కుంటూ చెప్పాడు సుబ్బారావు. | 7 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పిల్లి ... తల్లి ... ఒక పిల్ల పిడుగు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'పిల్లి ... తల్లి ... ఒక పిల్ల పిడుగు'
వంటింటి పనులు ముగించుకుని హాల్లోకి వచ్చిన సునందకు తమ పెంపుడు పిల్లి చనిపోయి కనిపించింది. ఆ విషయం తెలిస్తే తన బాబు ఎంత తల్లడిల్లిపోతాడో అని మధనపడింది. సాయంత్రం స్కూలునుండి రాగానే అటూ ఇటూ చూసి ‘‘పింకీ ఏది మమ్మీ?’’ అడిగాడు బాబు.
‘‘అది మధ్యాహ్నం దేవుడి దగ్గరకి వెళ్లింది కన్నా ... ’’ బాఽధగా చెప్పింది సునంద.
‘‘చనిపోయిన పిల్లిని దేవుడు ఏం చేసుకుంటాడు మమ్మీ?’’ ప్రశ్నించాడు బాబు. | 13 | ['tel'] |
మీ ఆవిడ కంట్లో పడకుండా అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'మీ ఆవిడ కంట్లో పడకుండా'
‘‘మీకు పెళ్లయిందా?’’ అడిగాడు టైలర్ అప్పారావు.
‘‘కాలేదు .... ఎందుకూ?’’ ఆశ్చర్యపోయాడు వివేక్.
‘‘ఏం లేదు, పెళ్లయితే సీక్రెట్ పాకెట్ కుడదామని’’ చెప్పాడు టైలర్ అప్పారావు. | 1 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రయోజన విద్య ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ప్రయోజన విద్య'
‘‘మీ తాతయ్య వయోజన విద్య ఎంతవరకు వచ్చిందిరా?’’ అడిగాడు సుందరం.
‘‘పక్కింటి బామ్మకి ప్రేమలేఖ స్వయంగా రాసుకునేదాకా’’ చెప్పాడు గోవిందం. | 10 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మహా పొదుపు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'మహా పొదుపు'
‘‘పెళ్లిచూపుల్లో అమ్మాయి గొప్ప పొదుపరి అంటే సంతోషించి ఒప్పుకున్నారా’’
‘‘మంచిదేగా ... ఈ ఏడుపు ఎందుకు?’’
‘‘బ్లేడుకు డబ్బు వృథా ... కత్తిపీటతో గడ్డం చేసుకోమంటోంది’’ | 13 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అప్పన్న తెలివిడి ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అప్పన్న తెలివిడి'
‘‘అదేంట్రా ... మళ్లీ ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నావు దేవుడ్ని?’’ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.
‘‘మాపెద్దమ్మాయి గౌన్లు పొట్టయిపోతున్నాయిరా. చూస్తూ చూస్తూ వాటిని పారేయలేం కదా’’ చెప్పాడు అప్పారావు. | 9 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక లోకమంతా పచ్చదనమే ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'లోకమంతా పచ్చదనమే'
ఒక ఛానల్లో పశు సంవర్ధక శాఖ అధికారి రైతుల సందేహాలకు సలహాలివ్వడం చూసి, స్ర్కోలింగవుతున్న ఫోను నెంబరుకు డయిల్ చేసి ‘‘ఎండుగడ్డిని మా ఆవులు బొత్తిగా మేయట్లేదు. పాల దిగుబడి తగ్గిపోతోంది. సలహా చెప్ప’’ మన్నాడు రైతు రాజన్న.
‘‘ఆవులకు ఆకుపచ్చ కళ్లజోళ్లు తగిలించండి ... ఫలితం ఉంటుంది ... నెక్ట్స్ కాల్’’ తన ధోరణిలో చెప్పి పళ్లు ఇకిలించాడు పశు వైద్యాకారి. | 8 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఇంటి కన్నా బస్సు పదిలం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఇంటి కన్నా బస్సు పదిలం'
‘‘ఈ బస్సు ఎక్కడికెళ్తుంది కండక్టరు గారూ?’’ అడిగాడు ఆసామి.
‘‘మీరెక్కడికెళ్లాలో చెప్పండి?’’ చిరాగ్గా అన్నాడు కండక్టర్.
‘‘ఎక్కడికీ లేదు. బస్సు ఇక్కడే కాసేపు ఉండే పనయితే వెనకసీట్లో ఓ గంటసేపు నడుం వాలుద్దామని’’ చెప్పాడు ఆసామి. | 11 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రోగం కుదిరించా ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'రోగం కుదిరించా'
‘‘ఈ రోజు మీకోసం అరడజను చేతి రుమాళ్లు కొనుక్కొచ్చా’’ ప్రేమగా అంది సుమ. ‘‘మరీ ఖరీదైనవి తీసుకురాలేదు కదా...’’ కాఫీ సిప్ చేస్తూ అడిగాడు భాస్కర్. ‘‘అంత తెలివి తక్కువ దాన్నా? ఫ్రీగా వచ్చాయి కాబట్టి తెచ్చాను’’ ‘‘ఫ్రీగానా?’’ సంతోషించాడు భాస్కర్. ‘‘అవును. పది వేలు పెట్టి పట్టుచీర కొంటే ఆ రూమాళ్లు ఫ్రీగా ఇచ్చారు’ | 8 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ ఛాన్సు మీదే ... ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఆ ఛాన్సు మీదే ...'
భర్తకు ప్రత్యేకంగా ఆర్గానిక్ కూరగాయలు కొందామని మార్కెట్కు వెళ్లింది శ్రీప్రియ.
‘‘ఇవి ఆర్గానిక్ కూరగాయలేనా?’’
కొత్తగా వచ్చిన సేల్స్ బాయ్కి శ్రీప్రియ మాట అర్థం కాక తల గోక్కున్నాడు.
‘‘క్రిమి సంహారక మందులేమీ వేయలేదా అని అడుగుతున్నా’’ మళ్లీ చెప్పింది ఆమె.
‘‘వేయలేదు మేడం ... మీరే వేసుకోవాలి’’ తడబడుతూ బదులిచ్చాడు కుర్రాడు. | 8 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ముసలోడి తెలివి ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ముసలోడి తెలివి'
రామయ్యకు బ్రహ్మ చెవుడు. ఆపరేషన్ చేయించుకున్నాడు. కొంత కాలం తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టరు తారసపడి అడిగాడు -
‘‘రామయ్యా .. ఇప్పుడు బాగా వినబడుతోందా?’’
‘‘బ్రహ్మాండంగా ...’’
‘‘మీ ఇంట్లో వారు సంతోషించి ఉండాలే’’
‘‘వాళ్లకు ఆపరేషన్ సంగతి తెలీదు’’.
‘‘ఎందుకు చెప్పలేదు?’’
‘‘నా గురించి ఏమనుకుంటున్నారో వినాలని’’.
‘‘ఏమనుకుంటున్నారు మరి?’’
‘‘మీరే అర్థం చేసుకోండి ... ఇప్పటికే ఆరుసార్లు నా వీలునామా మార్చి రాశాను’’. | 5 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పెళ్లంటే ఇంతేనా? ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'పెళ్లంటే ఇంతేనా?'
పెళ్లి గురించి ఎంత చెప్పినా అర్థం కాలేదు బంటికి. తండ్రి పెళ్లి ఆల్బమ్ చూపిస్తూ వివరించాడు. ఫోటోలు చూశాక ‘‘ఓహో ... మమ్మీ మనింట్లో పని చేయడానికి వచ్చిన రోజా’’ ఆరిందాలా అడిగింది బంటి. | 13 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మనసులోని కోరిక ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'మనసులోని కోరిక'
‘‘డాడీ ... సర్కస్కి వెళ్దాం’’ అడిగాడు నాలుగేళ్ల బాబు.
‘‘ఏముంటుందిరా అందులో ...’’ పెదవి విరిచాడు తండ్రి.
‘‘ఏనుగులున్నాయట డాడీ’’
‘‘అబ్బే .. ఏనుగుల్ని ఏం చూస్తాం రా?’’
‘‘అవి ఫుట్బాల్ ఆడతాయంట డాడీ’’
‘‘అబ్బే ... బోర్’’
‘‘షార్ట్స్ వేసుకున్న అమ్మాయిలు ఆ ఏనుగుల్ని ఆడిస్తారంట’’
‘‘సర్లే ... వెళ్దాం పద. సర్కస్ చూడక చాలా ఏళ్లయింది’’ | 7 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మెంటల్ కేస్ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'మెంటల్ కేస్'
‘‘ఈ కట్ డ్రాయర్ ఎంత?’’
‘‘అరవై రూపాయలు’’
‘‘వేసుకుని చూడొచ్చా?’’
‘‘కట్ డ్రాయరా ... సరే, చూసుకో’’
కొద్ది సేపు తర్వాత -
‘‘సరిగ్గా సరిపోయింది’’
‘‘ఐతే ప్యాక్ చేయిస్తాను’’
‘‘ఇది వేసుకున్నది కదా ... మరొకటి చేయించండి’’ | 10 | ['tel'] |
నేను మేధావి నవుతా అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'నేను మేధావి నవుతా'
‘‘పిల్లలూ .. మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో ఒక కాగితం మీద రాయండి’’ చెప్పింది టీచర్ మీనాక్షి.
కలెక్టరు, ఇంజనీరు, డాక్టరు, శాస్త్రవేత్త ... ఎవరికి తోచింది వాళ్లు రాస్తుండగా -
‘‘ష్ .. ’’ మెల్లిగా పిలిచాడు చింటు.
‘‘ఏంటీ?’’ అంతే మెల్లగా అడిగింది అమ్ములు.
‘‘మేధావిలో ‘ధ’కు పొట్టలో చుక్క ఉంటుందా?’’ | 1 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక జన్మహక్కు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'జన్మహక్కు'
‘‘బాధ్యత, హక్కు గురించి రెండు ముక్కల్లో చెప్పండి’’ అడిగాడు క్లాసు టీచర్ పీతాంబరం.
‘‘పాఠం చెప్పడం మీ బాధ్యత. వినడం, వినకపోవడం మా హక్కు’’ వెనక బెంచీ నుండి ఠపీమని వచ్చింది సమాధానం. | 5 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఓస్ ... ఇంతేనా? ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఓస్ ... ఇంతేనా?'
‘‘ఈ రోజు అమ్మా నాన్న ఆట ఆడుకుందాం’’ అమ్ములు.
‘‘నాకు రాదుగా’’ బుజ్జిగాడు.
‘‘ నేను చెబుతాగా. నువ్వు పేపర్లూ పుస్తకాలూ నాపైకి విసురు. నేను గ్లాసులూ గిన్నెలూ నీ మీదకి విసురుతాను. కాసేపయ్యాక నువ్వు తలుపు దఢేల్మని లాగి బజారుకెళ్లు. నేనేమో ఈ చిన్నూగాడి వీపు పగలగొడతాను .. ఇంతే’’ చెప్పింది అమ్ములు. | 8 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తెలివైన నాన్న ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'తెలివైన నాన్న'
‘‘దారుణమైన మోసం జరిగిపోయింది మామా’’ భోరుమన్నాడు అఖిల్.
‘‘ఏమైందిరా?’’ అడిగాడు సునీల్.
‘‘పుస్తకాలు కొనాలి డబ్బులు పంపమని ఫోన్ చేస్తే, పుస్తకాలు కొని పంపించాడు మా అయ్య’’ మళ్లీ భోరుమన్నాడు అఖిల్. | 14 | ['tel'] |
ఆయన చేతిలో లేదు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'ఆయన చేతిలో లేదు'
‘‘గత పదేళ్లుగా కఠోర తపస్సు చేస్తున్నా ... దేవుడు ప్రత్యక్ష్యం కావటం లేదు స్వామీ?’’ అడిగాడు జూనియర్ స్వామి.
‘‘ఏం కోరుకుందామని ఈ తపస్సు?’’ కళ్లు విప్పి అడిగాడు సీనియర్ స్వామి.
‘‘ధరలు తగ్గించమని అడుగుతా’’ నిజాయితీగా చెప్పాడు జూనియర్.
‘‘ఈ జన్మలో నీకు దేవుడు ప్రత్యక్షం కాడు’’ మళ్లీ కళ్లు మూసుకుంటూ అన్నాడు సీనియర్. | 1 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వదిలేరకం కాదు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'వదిలేరకం కాదు'
‘‘అదేంటండి .. క్షవరం మరీ అంత చిన్నగా చేయించుకొచ్చారు?’’ ఆశ్చర్యపోయింది భార్య.
‘‘ముందు మామూలుగానే చేశాడోయ్. యాభై నోటు ఇస్తే చిల్లర లేదన్నాడు. ఊరికే వదిలేయడం ఎందుకని, ఆ చిల్లరకు సరిపడా కట్ చేయమన్నా’’ చెప్పాడు భర్త. | 14 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నెట్ కుటుంబం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నెట్ కుటుంబం'
ఏకలింగం సోషల్ నెట్ వర్కింగ్ ప్రభావంతో తన కుటుంబాన్ని ఇలా పరిచయం చేశాడు -
‘‘ఈమె నా భార్య గూగుల్ రాణి - ఒక్కటి అడిగితే పది చెబుతుంది. వీడు నా కొడుకు ఫేస్బుక్ కుమార్. ఇంట్లో విషయాలన్నీ లోకానికి అందజేస్తాడు. ఈమె నా కూతురు ట్విట్టర్ కుమారి. కాలనీ మొత్తం దీన్ని ఫాలో అవుతుంది. ఈమె మా అమ్మ. వాట్సప్ మాత. రోజంతా బుడ్బుడ్మని చప్పుడు చేస్తూనే ఉంటుంది. ఇక నేను ఆర్కుట్ లింగాన్ని - నన్నెవడూ పట్టించుకోడు. | 7 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ‘ఫేస్’బుక్కయింది! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: '‘ఫేస్’బుక్కయింది!'
‘‘డార్లింగ్ నిన్న వాల్ మీద పిక్చర్ మార్చాను. ఎలా ఉందో చెప్పలేదేం?’’ అడిగాడు సుమంత్.
‘‘నా ఫేస్బుక్లో నోటిఫికేషన్ రాలేదే’’ ఆశ్చర్యపోయింది అమల.
‘‘నీకు నెట్ పిచ్చి బాగా ముదిరింది. నేను మార్చింది ఫేస్బుక్లో కాదు మన బెడ్రూమ్లో’’ చిరాకు పడ్డాడు సుమంత్. | 6 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రైల్వే పెళ్లికొడుకు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'రైల్వే పెళ్లికొడుకు'
‘‘మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి’’ శుభలేఖ అందిస్తూ చెప్పాడు రైల్వే ఉద్యోగి మృత్యుంజయరావు.
‘‘పెళ్లి రైట్ టైముకేనా, లేటుందా?’’ క్యాజువల్గా అడిగాడు అనంతమూర్తి. | 3 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అమ్మ ... సర్వరో! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అమ్మ ... సర్వరో!'
‘‘సర్వర్, నీకు వచ్చిన టిప్స్తో ఏం చేస్తావు?’’ అడిగాడు అరవిందం.
‘‘మంచి హోటల్కి వెళ్లి భోజనం చేస్తాను సార్’’ చెప్పాడు సర్వర్ భజగోవిందం
. | 4 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సెటింగో ... బెట్టింగో! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'సెటింగో ... బెట్టింగో!'
దేవుడికీ డాక్టరుకీ ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు. డాక్టరుకి కోపం వస్తే దేవుడి దగ్గరకు పంపిస్తాడు. ఇదంతా ఒక సెట్టింగు | 6 | ['tel'] |
కక్ష తీరే మార్గమదే! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'కక్ష తీరే మార్గమదే!'
పెళ్లయిన ఏడాదికే రాణి చావు బతుకుల్లో హాస్పటల్లో చేరింది. చివరి మాటగా భర్తతో -
‘‘మీరు మళ్లీ తప్పక పెళ్లి చేసుకోవాలి. అదీ నా ఫ్రెండ్ పద్మను మాత్రమే’’ మాట తీసుకుంది.
‘‘పద్మ అంటే నీకు ఎంత ప్రాణం రాణీ’’ కళ్లు తుడుచుకున్నాడు వెంకట్రావు.
‘‘ఆ దిక్కుమాలిందే నీతో నన్ను పెళ్లికి ఒప్పించింది. అది ఇంతకింతా అనుభవించాలి’’ పైకి అనలేక తల ఊపింది రాణి. | 1 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఒక వికెట్కి ఒక ఉద్యోగం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఒక వికెట్కి ఒక ఉద్యోగం'
‘‘మా హాస్పిటల్లో ఆపరేషన్ ఫెయిలై పేషెంటు చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇక్కడే ఉద్యోగం ఇస్తారు తెలుసా?’’ గొప్పగా చెప్పింది నర్స్ నాంచారి.
‘‘అసలు సంగతి అదన్నమాట! ఇంత చిన్న హాస్పిటల్లో రోగులకంటే సిబ్బంది ఎక్కువుందేం చెప్మా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను’’ అంది నాంచారి స్నేహితురాలు మయూరి. | 11 | ['tel'] |
గడుగ్గాయి అనే శీర్షిక తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'గడుగ్గాయి'
‘‘ఏం తమాషాగా ఉందా? కీటకాలను గీయమంటే తెల్లపేపరు ఇస్తావా?’’ అరిచాడు డ్రాయింగ్ మాస్టారు.
‘‘నేను గీసినవి సూక్ష్మజీవులు సార్. కళ్లకు కనిపించవు. భూతద్దంలో చూడాల్సిందే’’ చెప్పాడు విద్యార్థి. | 1 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఇప్పుడా... ఇదివరకా? ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఇప్పుడా... ఇదివరకా?'
‘‘నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదిలేసి ఊరికి దూరంగా బతికేవాళ్ళను ఏమంటారు?’’ టీచర్ ఒక పిల్లవాణ్ణి అడిగాడు.
‘‘ఇప్పుడా? ఇదివరకా?’’ అడిగాడు పిల్లవాడు.
‘‘రెండూ చెప్పు’’ ఆశ్చర్యపోతూ అన్నాడు టీచర్.
‘‘ఇదివరకైతే ఋషులు. ఇప్పుడైతే ఐ.టి. ఉద్యోగులు.’’ | 3 | ['tel'] |
చిక్కలేదు అనే టైటిల్ తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'చిక్కలేదు'
చాలాకాలం తర్వాత రెండు పుస్తకాలు ఎదురుపడ్డాయి లైబ్రరీ టేబిల్ మీద.
‘ఏంటలా చిక్కిపోయావు? ఎండలకా?’ అని అడిగింది ఒక పుస్తకం రెండోదాన్ని.
‘కాదు. ఎవడికో కోపం వచ్చి ముందుమాటలన్నీ చించేశాడు’ జవాబిచ్చింది అది. | 2 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పోలిక ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'పోలిక'
‘‘ప్రేమకు, పెళ్లికి తేడా ఏంటి?’’ అడిగాడు సురేష్.
‘‘ప్రేమ సైకిల్ ప్రయాణమైతే, పెళ్లి పడవ ప్రయాణం’’ చెప్పాడు రమేష్.
‘‘అదెలా?’’ ఆరా తీశాడు సురేష్.
‘‘ఇష్టం లేకపోతే సైకిల్ దిగిపోవచ్చు. కాని పడవప్రయాణంలో మధ్యలో దిగడం కుదరదు కదా’’ వివరించాడు రమేష్. | 10 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ టపా కట్టే వయసే ముఖ్యం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'టపా కట్టే వయసే ముఖ్యం'
డెభై ఏళ్ల వైకుంఠం పాతికేళ్ల పడుచు ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆమెతో చెప్పడానికి ధైర్యం చాలక -
‘‘ఒరే, పెళ్లీ పెటాకులూ లేకుండా ఇన్నేళ్లూ వ్యాపారంలో పడి దాదాపు పదికోట్లు వెనకేశాను. అనుభవించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పడుచుపై మనసు పడ్డాను. నా వయసు 30 ఏళ్లు తగ్గించి చెబితే పెళ్లికి ఒప్పుకుంటుందం టావా’’ మిత్రుడు శ్రీశైలంతో మొరపెట్టుకున్నాడు.
‘‘కచ్చితంగా ఒప్పుకుంటుంది - కాకపోతే, ఇప్పటి నీ వయసుకి మరో 20 ఏళ్లు కలిపి చెబితే’’ సలహా ఇచ్చాడు శ్రీశైలం. | 11 | ['tel'] |
నేమ్ ప్లేట్ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు | శీర్షిక: 'నేమ్ ప్లేట్'
‘‘హలో సార్ పోయిన సంవత్సరం ఈ వీధిలో వెళుతున్నపుడు చూస్తే మీ ఇంటి ముందు సురేష్ బి.ఎ. అని ఉంది. ఇప్పుడు చూస్తే సురేష్ ఎం.ఎ అని ఉంది. ఏడాదిలో ఎం.ఎ పూర్తి చేశారా?’’ అడిగాడు ఒకాయన ఆ దారిన పోతూ.
‘‘మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. పోయిన సంవత్సరం మా ఆవిడ చనిపోయినపుడు ‘బ్యాచిలర్ ఎగైన్’ అన్న అర్థంలో బి.ఎ. అని పెట్టాను. ఈ మధ్యే మళ్ళీ పెళ్ళి చేసుకున్నా కాబట్టి ‘మ్యారీడ్ ఎగైన్’ అర్థంలో ఎం.ఎ అని పెట్టాను’ వివరించాడు సురేష్ | 2 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఒకేలా ఎందుకు? ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఒకేలా ఎందుకు?'
చైనా వాళ్ళందరూ ఒకేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఒక అబ్బాయి.
‘దేవుడు ప్రతి ఒక్కరినీ వేరువేరుగా తయారు చేస్తాడని చెప్పావు కదా! మరీ వీళ్ళనెందుకమ్మా ఒకేలా తయారుచేశాడు?’ అని తల్లిని అడిగాడు.
‘140 కోట్ల మందిని వేరేవేరుగా తయారు చేయాలంటే మాటలా నాన్నా! పైగా ఆయన ఆ టైంలో అమెరికా నుంచి ఇటొస్తున్నాడట. అలిసిపోయుంటాడు’ చెప్పింది తల్లి. | 12 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ‘ఒక్కటే మిగులుతుంది’ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: '‘ఒక్కటే మిగులుతుంది’'
ఐదేళ్ళ కూతురికి తల్లి కూడికలు, తీసివేతల లెక్కలు చెపుతోంది.
‘నాన్న అన్నయ్య కోసం తెచ్చిన స్వీట్ బాక్స్లో 50 స్వీట్లు ఉన్నాయనుకో. అందులో 40 మీ అన్నయ్య తినేశాడనుకో. ఎన్ని మిగులుతాయి?’
‘బాక్స్లో ఎన్ని మిగులుతాయో కాని అన్నయ్యకు డయాబెటిస్ మాత్రం జీవితాంతం మిగులుతుంది.’ | 11 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రేమ పరీక్ష ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ప్రేమ పరీక్ష'
‘అమ్మా! నేనంటే నీకు ప్రేమ ఉందా?’
‘ఎందుకు లేదు నాన్నా! నీకా సందేహమెందుకు?’
‘అయితే నాన్నకు డైవోర్స్ ఇచ్చి, ఆ ఐస్క్రీం షాపు అంకుల్ని పెళ్ళి చేసుకో.’’
‘‘....!!’’ | 11 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రక్షణ కోసం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'రక్షణ కోసం'
‘‘నాలుక తడిగానే ఎందుకుంటుంది?’’ అడిగింది సైన్స్ టీచర్.
‘‘నిప్పులాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా ఉండడం కోసమేమో టీచర్’’ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు తరుణ్. | 13 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఏం చేస్తున్నావు? ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఏం చేస్తున్నావు?'
‘‘ఇంట్లో దొంగలు పడి ల్యాప్టాప్ తప్ప అన్నీ దోచుకుపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావయ్యా?’’ అడిగాడు పోలీసు.
‘‘ఫేస్బుక్ చూస్తున్నా’’ చెప్పాడు వీరవెంకటసాయి సత్యన్నారాయణ. | 14 | ['tel'] |
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కింద కాదు పైన చూడు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'కింద కాదు పైన చూడు'
‘‘ఏరా లెక్కల్లో మార్కులు వందకు పైనే వచ్చాయన్నావు? నాకు ఇక్కడ రెండు మార్కులే కన్పిస్తున్నాయి’’ చిందులేశాడు తండ్రి.
‘‘అవున్నాన్నా .. ఆ రెండూ ఎక్కడ వేశారో సరిగ్గా చూడండి. వందకు పైనే కదా’’ తాపీగా చెప్పాడు పుత్రరత్నం. | 10 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వదిలిచూడండి! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'వదిలిచూడండి!'
‘‘ఆరునెలల జైలు శిక్ష ... లేదా మూడు వేల రూపాయల జరిమానా .. రెండింటిలో ఏది నీకిష్టం?’’ అడిగాడు న్యాయమూర్తి.
‘‘జరిమానా కడతానండి’’ చెప్పాడు జేబుదొంగ మునుస్వామి.
‘‘మరి నీ చేతిలో అంత డబ్బుందా?’’ అడిగాడు న్యాయమూర్తి.
‘‘ఇప్పుడు లేదు. సెంటర్ దాకా వెళ్లిరావడానికి అరగంట పర్మిషన్ ఇవ్వండి చాలు ... చిటికెలో తెస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు మునుస్వామి. | 12 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తెలివైన నాన్న ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'తెలివైన నాన్న'
‘‘దారుణమైన మోసం జరిగిపోయింది మామా’’ భోరుమన్నాడు అఖిల్.
‘‘ఏమైందిరా?’’ అడిగాడు సునీల్.
‘‘పుస్తకాలు కొనాలి డబ్బులు పంపమని ఫోన్ చేస్తే, పుస్తకాలు కొని పంపించాడు మా అయ్య’’ మళ్లీ భోరుమన్నాడు అఖిల్. | 11 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కండక్టర్ బుద్ధి ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'కండక్టర్ బుద్ధి'
కండక్టర్ కాంతయ్య పెళ్లి జరుగుతోంది. పెళ్లికూతురు వెనక ఆమె తాలూకూ ఆడంగులు గుంపుగా కూర్చుని ఉన్నారు. మరో ఇద్దరు చుట్టాలు వేదిక మీదికి రాగానే పెళ్లిపీటల మీద ఉన్న కాంతయ్య వెనక్కి తిరిగి ‘‘కొద్దిగా సర్దుకోండమ్మా ... ఇంకా ఇద్దరు పడతారు’’ చిరాకుగా అరిచాడు. | 7 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దిక్కుమాలిన మిషన్ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'దిక్కుమాలిన మిషన్'
‘‘ఏమిటి పిన్నిగారూ ఊరునుండి రావడంరావడంతోనే అంత కోపంగా ఉన్నారు?’’ ఆరా తీసింది పక్కింటి నరసమ్మ.
‘‘ఇందాక బస్టాండులో బరువు చూసుకుందామనిweighing
machineలో కాయిన్ వేస్తే ‘‘ఒకేసారి ఇద్దరు ఎక్కకూడదు’’ అనే కార్డు వచ్చింది’’ కసిగా చెప్పింది అలివేలమ్మ. | 5 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ ఒక్కటీ అడక్కు! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఆ ఒక్కటీ అడక్కు!'
‘‘రోజూ అడుక్కుని ఎంత సంపాదిస్తావోయ్?’’ రూపాయి బిళ్ల వేస్తూ అడిగింది ఆండాళ్లమ్మ.
‘‘క్షమించండమ్మా ... ఆడాళ్ల వయసు, మగాళ్ల సంపాదన అడక్కూడదంటారు’’ వినయంగా చెప్పి ముందుకు వెళ్లాడు బిచ్చగాడు. | 3 | ['tel'] |
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ నిజమే! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అదీ నిజమే!'
ఎండ నుండి వేగలేక టోపీ కొందామని షాపుకు వెళ్లాడు బోసుబాబు.
‘‘ఆ గోధుమరంగు టోపీ ఎంతండి?’’
‘‘199 రూపాయలు’’
‘‘బాబోయ్ ... అంత ధరా! ఆ డబ్బుల్తో మరో జత చెప్పులే వస్తాయి కదా’’
‘‘చెప్పుల్ని తల మీద పెట్టుకోలేరు కదండి’’ | 6 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మేడిన్ ఇండియా! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'మేడిన్ ఇండియా!'
జపాన్ నుండి హైదరాబాదు వచ్చాడు అకీరా. ఒకరోజు చార్మినార్ చూడ్డానికి కోఠి దగ్గర యాదగిరి ఆటో ఎక్కాడు. దారిలో వేగంగా దూసుకుపోతున్న Honda, Tayota, Mitsubishi కార్లను చూసి యాదగిరితో ‘‘ఇవన్నీ ‘మేడిన్ జపాన్’ తెలుసా ... సూపర్ ఫాస్ట్’’ అన్నాడు గొప్పగా. యాదగిరి విని ఊరుకున్నాడు.
చార్మినార్ దగ్గర ఆటో దిగిన అకీరా మీటర్ బిల్ చూసి గుడ్లు తేలేసి ‘‘టూ ఎక్సెపెన్సివ్’’ అన్నాడు కోపంగా.
‘‘మీటర్ మేడిన్ ఇండియా... వెరీ వెరీ ఫాస్ట్’’ కూల్గా బదులిచ్చాడు యాదగిరి. | 3 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ‘ఎ’ క్లాస్ వెంగళప్ప ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: '‘ఎ’ క్లాస్ వెంగళప్ప'
చంద్రకిరణ్ ఇంటర్వ్యూకి వెళ్లాడు.
‘‘నీకు ఎం.ఎస్. ఆఫీస్ తెలుసా?’’ అడిగాడు అధికారి.
‘‘తెలియదు. అడ్రస్ చెబితే చిటికెలో వెళ్లొస్తా’’ ఠపీమని బదులిచ్చాడు చంద్రకిరణ్. | 14 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వాక్య నిర్మాణం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'వాక్య నిర్మాణం'
‘‘ఎద్దు, ఆవు గడ్డి మేస్తున్నారు ... ఇదేం వాక్యం! సరిగ్గా రాయి’’ అరిచింది గ్రామర్ టీచర్.
‘‘ఆవు, ఎద్దు గడ్డి మేస్తున్నారు’’ దాన్నే కొంచెం మార్చి రాసి చూపించాడు గోపి.
‘‘నీవు ముందు రాసిందీ, ఇదీ ఒకటే కదా ... తేడా ఎముంది?’’ మరింత కోపంగా అంది టీచర్.
‘‘లేడీస్ ఫస్ట్ అని ఆవును ముందు పెట్టాగా’’ చెప్పాడు గోపి. | 9 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆదర్శమూర్తివి నీవయ్యా! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఆదర్శమూర్తివి నీవయ్యా!'
‘‘నీవు ఎవరి అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నావు?’’ అడిగాడు ఏసుపాదం.
‘‘మహాత్మాగాంధీ’’ ఠపీమని చెప్పాడు పదేళ్ల సుందరం.
‘‘వెరీ గుడ్ సెలక్షన్ ... కారణం ఒక్కముక్కలో చెప్పగలవా?’’ అడిగాడు ఏసుపాదం.
‘‘పదమూడేళ్ల వయసులో పెళ్లిచేసుకున్నాడు కాబట్టి’’ చెప్పాడు సుందరం. | 9 | ['tel'] |
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నా పేరు మార్చేయకు! ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'నా పేరు మార్చేయకు!'
‘‘గిజిడ""Why
are you trespassing''’’ కంచె దూకబోతున్న వ్యక్తిని అడిగాడు నవరతన్.
‘‘ఐయామ్ నాట్ ట్రెస్పాసింగ్ ... ఐయామ్ యశ్వంత్ సింగ్’’ కోపంగా చెప్పాడు దూకబోతున్న వ్యక్తి. | 8 | ['tel'] |
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుమానం పీనుగు ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'అనుమానం పీనుగు'
నిద్రలో ఉన్న శంకర్రావు సెల్ బీప్ శబ్దం వినగానే తుళ్లిపడి లేచాడు. భార్య మొబైల్ చెక్ చేసి కోపంతో ‘‘ఎవడు ... అర్ధరాత్రి వేళ నీ సెల్కు-BEAUTIFULఅని మెసేజ్ పంపాడు’’ అని నిలదీశాడు.
కంగారుగా నిద్రలేచిన సుమలత మెసేజ్ చెక్ చేసి ‘‘ముందు ఆ కళ్లద్దాలు తగిలించుకోండి. అదిBEAUTIFULకాదుBATTERYFULL' అని కయ్యిమంది. | 5 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రేమ స్వగతం ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ప్రేమ స్వగతం'
‘‘ఒకమ్మాయి ఉండేది
నన్నుచూసి నవ్వేది
నవ్వుతూ పాట పాడేది
పాడుతూ సిగ్గుపడేది
సిగ్గుపడుతూ మెలికలు తిరిగేది
నేను అనుకున్నా ... ప్రేమేమో అని.
కాని, తర్వాత తెలిసింది తను పిచ్చిదని!!’’ | 13 | ['tel'] |
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఖరీదు చెల్లిస్తాను ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'ఖరీదు చెల్లిస్తాను'
డాక్టర్: సారీ అప్పారావు గారు. ఆపరేషన్లో చిన్న పొర పాటు జరిగింది. మీ పొట్టలో నా చేతి గ్లోవ్ ఒకటి ఉండిపోయింది. మళ్ళీ ఆపరేషన్ చేయాలి.
అప్పారావు: దానికి మళ్ళీ ఆపరేషన్ ఎందుకండీ...ఆ 20 రూపాయలు నేనే ఇస్తాను. కొత్తది కొనుక్కోండి. | 9 | ['tel'] |
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కనికరించండి ప్లీజ్ ఉండే లాగా ఇవ్వు. | శీర్షిక: 'కనికరించండి ప్లీజ్'
ఒక కుర్రాడు కాలేజీ గ్రౌండ్లో చాకు పట్టుకుని తిరుగుతున్నాడు.
లెక్చరర్: ఏంట్రా కాలేజీలో చాకు పట్టుకు తిరుగుతున్నావ్?
స్టూడెంట్: పేద విద్యార్థిని సార్. రివా ల్వర్ కొనుక్కునే స్తోమత లేదు. | 7 | ['tel'] |